కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణం

On

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
గ్రామంలోని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని హైందవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా హైందవ కమిటీ చైర్మన్ పెనగొండ యాకెంధర్ స్వామి వారికి పుస్తె మట్టెలు, తలంబ్రాలు సమర్పించారు. గ్రామ సర్పంచ్ మురాశెట్టి ఉమ అంజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే ధర్మపురి దేవాలయం ఈఓ  సతీమణి నిరూప కూడా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి భక్తి ప్రగాఢతను చాటుకున్నారు.
దేవాలయ అర్చకులు తోమాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య కళ్యాణం వైభవంగా జరిగింది.కల్యాణం అనంతరం భక్తులకు వడపప్పు, పానం,అలాగే ప్రసాదాలు పంపినిచేసారు ఈ వేడుకలో వేణుగోపాలస్వామి దేవాలయ చైర్మన్ రాంబాబు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.,

Views: 53
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News