కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా

On
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా

కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా

IMG-20260501-WA0458
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 01, న్యూస్ ఇండియా ప్రతినిధి: పెద్ద అంబర్‌పేట్‌ కేసరిగుట్టలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభూ హనుమాన్ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు కన్నుల పండువగా నిలిచింది. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ, అష్టోత్తర శతనామావళి పూజ, కర్పూర హారతి, విశ్వక్సేన పూజ, వాసుదేవ, పుణ్యహవాచన కలశ స్థాపన, దీక్ష కంకణ ధారణ వంటి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధాన ఘట్టమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం భక్తి పరవశంలో సాగింది. ఈ కళ్యాణోత్సవంలో పిల్లి నరసింహ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ పవిత్ర కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్థానికులతో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు ప్రస్తుత, మాజీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించింది.

Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్