గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు

*మహబూబాబాద్ జిల్లా:* 
*తొర్రూరు సెంటర్:*


మహబూబాబాద్ జిల్లాలో గంజాయి రహిత సమాజం లక్ష్యంగా పోలీసులు చర్యలను మరింత వేగవంతం చేస్తున్నారు. గౌరవ జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు, తొర్రూరు డీఎస్పీ సూచనలతో, సీఐ  ఆధ్వర్యంలో తొర్రూరు సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
తొర్రూరు పట్టణంలోని మారుమూల ప్రాంతాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి నిల్వ, రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
అలాగే అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి వారి వివరాలను సేకరించడంతో పాటు, ప్రజలకు గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజలు కూడా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

Views: 102
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్