పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు

తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి హెచ్చరిక

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు


​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా మామిడి తోటలు, ఇతర పంటలు దగ్ధమయ్యాయి. దీనివల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడు శివరాత్రి వెంకటయ్యను సోమవారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ రెడ్డి మండల ప్రజలకు మరియు రైతులకు పలు సూచనలు చేశారు ​అవశేషాలను కాల్చవద్దు: పొలాల్లో పంట కోతలు పూర్తయిన తర్వాత మిగిలిన వ్యర్థాలను, అవశేషాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగులబెట్టకూడదు. వేసవి కాలం దృష్ట్యా చిన్న నిప్పుకణిక కూడా పెను ప్రమాదానికి దారితీసి పక్కనే ఉన్న తోటలకు, ఆస్తులకు నష్టం కలిగించే అవకాశం ఉంది.IMG-20260525-WA0060 ఎవరైనా నిబంధనలు అతిక్రమించి పంట అవశేషాలను కాల్చినా లేదా ఇతరుల ఆస్తులకు నష్టం కలిగించినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
​"రైతులు ఎంతో కష్టపడి పెంచిన పంటలు అగ్నిపాలై నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలి.

Views: 14
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?