వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు యువకుల దుర్మరణం

వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం

వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు యువకుల దుర్మరణంIMG_20260520_100806

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలి కట్ట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ధాన్యం లోడ్ ట్రాక్టర్ ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ విషాద ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్ (25), లింగమల్ల సతీశ్ (28), పొట్టకర్ల వంశీ (22) ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు వెళ్తు న్నారు. ఈ క్రమంలో వెలికట్ట శివారులోని పాలకేంద్రం సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ముందు వెళ్తున్న ధాన్యం లోడ్ ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అల్లి సంపత్, లింగమల్ల సతీశ్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన పొట్టకర్ల వంశీని 108లో వర్ధన్నపేటకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతుడు అల్లి సంపత్ కొద్దిరోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. లింగమల్ల సతీశ్ భార్య మూడు సంవత్సరాల క్రితమే మృతి చెందగా, అతడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ముగ్గురు యువకులు మృతి చెంద డంతో బొడ్లాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న తొర్రూరు సీఐ గణేశ్, ఎస్సై మహేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 107
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?