సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..

అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు అభినందనలు..

On
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..

సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..

అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు అభినందనలు..

IMG-20260607-WA0982
సీఎం సభ విజయవంతంపై అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ జూన్ 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: “కాంగ్రెస్ కార్యకర్తలే నా బలం.. పార్టీకి వారే నిజమైన బలగం” అని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోహెడలో శనివారం సాయంత్రం నిర్వహించిన ముఖ్యమంత్రి సభ విజయవంతం కావడంతో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమీకృత మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కాంప్లెక్స్‌ల శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు, రైతులు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. సభ నిర్వహణకు ముహూర్తం ఖరారైన నాటి నుంచే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు తెలిపారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు ప్రశాంతంగా తిరిగి వెళ్లే వరకు అధికారులతో కలిసి పర్యవేక్షణ కొనసాగించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం.. సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం.. అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు అభినందనలు.. సీఎం సభ విజయవంతంపై అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే మల్ రెడ్డి...
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు