సింగరేణిలో వ్రాత పరీక్షలు

సింగరేణిలో జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులకు వ్రాత పరీక్ష

On
సింగరేణిలో వ్రాత పరీక్షలు

IMG-20260614-WA1005భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత అభ్యర్ధులతో భర్తీ చేయుటకు ఆదివారము సింగరేణి మహిళా డిగ్రీ& పి‌జి మరియు జూనియర్ కళాశాలలో వ్రాత పరీక్ష నిర్వహించరు.జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి ‘17’ ఖాళీ కు గాను అర్హులయిన '695' మంది అభ్యర్ధులకు హాల్ టికెట్లు జారీ చేయగా, '642' మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ వ్రాత పరీక్ష సెక్యూరిటీ, విజిలెన్స్ & సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో, సి‌సి కెమెరాల నిఘా మధ్య నిర్వహించరు.సింగరేణి మహిళా డిగ్రీ& పి‌జి మరియు జూనియర్ కళాశాలలో జరిగిన ఈ పరీక్షను జి‌ఎం(పర్సనల్) ఈ‌ఈ & ఆర్‌సి ఏ.జే.ఎం మురళీధర రావు మరియు ఏ‌జి‌ఎం(విజిలెన్స్) ఎస్.వి.మురళీధర రాజు పర్యవేక్షించి, పరీక్ష పూర్తిగా మెరిట్ పై ఆధారపడి ఉంటుందని, దళారులకు ఎలాంటి ప్రమేయం ఉండదని, వారిని నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు.ఈ పరీక్ష ఫలితాలు ఆదివారం రాత్రి నుంచే సింగరేణి వెబ్ సైట్ మరియు సింగరేణి ప్రధాన కార్యాలయ ముఖద్వారం వద్ద నోటీస్ బోర్డుద్వారా తెలియజేయటం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ పరీక్ష నిర్వహణ పరీశీలనలో జి‌ఎం(పర్సనల్) ఈ‌ఈ & ఆర్‌సి ఏ.జే.ఎం మురళీధర రావు మరియు ఏ‌జి‌ఎం(విజిలెన్స్) ఎస్.వి.మురళీధర రాజు, డి‌జి‌ఎం(పర్సనల్).వేణు గోపాల రావు, పర్సనల్ మేనేజర్ బి.సమ్మయ్య డి‌వై.పి‌ఎం లు డి.నాగేశ్వర రావు, కే.సంతోష్ కుమార్, విజిలెన్స్ ఆఫీసర్స్ ఎస్‌డి.షాకిర్ మొహినుద్దీన్,ఎం‌డి.హషిం పాషా, సింగరేణి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి.సంధ్యా రాణి, డిగ్రీ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి.మంజుల మరియు ఇతర అధికారులు, విజిలెన్స్ & సెక్యూరిటీ సిబ్బంది, రిక్రూట్మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Views: 12
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్