తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

మహబూబాబాద్ జిల్లా:-
తొర్రూరు సెంటర్:-


మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం రోడ్డులోని భద్రకాళి ఆలయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గుర్తూరు గ్రామానికి చెందిన జడల నవీన్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్ నెల్లికుదురు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు తొర్రూరుకు వచ్చిన ఆయన చేపలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నవీన్ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పి ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన పెట్రోల్ ట్యాంకర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తోట మహేందర్ రెడ్డి తెలిపారు. అక్కడికి వచ్చిన యువతకు బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కచ్చితంగా ధరించి ఉంటే మృతుడు బ్రతికి ఉండేవాడు కదా అని అక్కడ ఉన్న స్థానికులను హెచ్చరించారు.


రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతితో గుర్తూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Views: 439
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్