ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్

On
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్

భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి -10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్  విజయవంతంగా ముగిసింది. ప్రారంభం నుండి ఫైనల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్ భద్రాద్రి ప్రాంతంలో క్రీడా పండుగగా నిలిచింది.ముగింపు సందర్భంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దుమ్ముగూడెం చెందిన ఆర్వీ–11 మరియు మణుగూరు చెందిన ముజ్జు–11 జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ముజ్జు–11 జట్టు 10 ఓవర్లలో 105 పరుగులు సాధించగా, లక్ష్యాన్ని ఆర్వీ–11 జట్టు కేవలం 8.1 ఓవర్లలో చేధించి విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఆర్వీ–11 జట్టు రూ.55,555 నగదు బహుమతి మరియు భారీ ట్రోఫీని అందుకోగా, రన్నరప్‌గా నిలిచిన ముజ్జు–11 జట్టు రూ.33,333 నగదు బహుమతి మరియు ట్రోఫీని అందుకుంది. అనంతరం వివిధ విభాగాల్లో క్రీడాకారులకు ట్రోఫీలు అందజేయడంతో పాటు ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రా గిఫ్ట్ హ్యాంపర్లను కూడా పంపిణీ చేశారు.ఈ ముగింపు కార్యక్రమానికి భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మారావు, నందిని రెసిడెన్సీ అధినేత నక్కా ప్రసాద్, డా. పాల్–రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ జక్రయ్య, ఎటపాక జడ్పీటీసీ ఉబ్బా సుస్మిత, కాంగ్రెస్ నాయకులు ఎండీ జిందా, ఉబ్బా వేణు, బీజేపీ నాయకులు మోహన్ కృష్ణ, రమేష్, ఉపాధ్యాయులు కారం సర్వేశ్వరరావు, యంగ్ బాయ్స్ లోకేష్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపడం అభినందనీయమని, ఇటువంటి టోర్నమెంట్లు గ్రామీణ ప్రాంత యువతకు ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా నిలుస్తాయని తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన మరియు ఆరోగ్యకరమైన పోటీ స్పూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు.ఐపీఎల్ తరహాలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో మొత్తం 208 మంది క్రీడాకారులను 16 జట్లు వేలంపాట ద్వారా ఎంపిక చేసుకుని మార్చి 8 నుండి 18 వరకు మ్యాచ్‌లు ఉత్సాహభరితంగా కొనసాగాయి.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు కుంజా సంతోష్, పందా అమృతరావు (అంబు), తాళ్ళ నాగరాజు, తాళ్ళ రమేష్, శీలం నాగరాజు, శ్రీకాంత్, నాగార్జున, గోపి, సుమన్, భార్గవ్, శ్యామ్, మున్నా భాయ్, రోహిత్ పాషా, ఖాసీం, రాము, నరేందర్, మంచు మనోజ్, దినేష్, గణేష్, చింటు తదితరులు పాల్గొన్నారు.

Views: 20
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..