మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

కోడి పిల్లలను సజీవ దహనం?

On
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

కోడి పిల్లలను సజీవ దహనం?

మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

రంగారెడ్డి జిల్లా, తుర్కయంజాల్, మార్చి 02, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని మన్నెగూడలో ఎస్ఆర్ హ్యాచరీస్ యాజమాన్యం అమానుషంగా కోడి పిల్లలను సజీవంగా కాల్చివేస్తోందని పక్కపొలాల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హ్యాచరీలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్తను కూడా ఇష్టారీతిగా తగలబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. పొలాల్లో వ్యవసాయ పనుల కోసం వెళ్లినప్పుడు వ్యర్థాల దహనం వల్ల వ్యాపించే దుర్వాసనను తట్టుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగమంచు ముసురుకున్నట్లు పొగ కమ్మేసి పంటలకు కూడా నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు. పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా వ్యర్థాలను తగలబెట్టడం చట్ట విరుద్ధమని, వెంటనే ఈ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంస్థ ఓ మాజీ ఎంపీకి చెందినదిగా ప్రచారం ఉండటంతో, స్థానికంగా ఎవరూ బహిరంగంగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని గ్రామస్థులు అంటున్నారు. ప్రభావశీలుల సంస్థ కావడంతో అధికారులు కూడా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత పశుసంవర్ధక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్థలాన్ని పరిశీలించి, నిజానిజాలు తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Views: 17

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..