అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం

38.50 లక్షల వ్యయంతో గ్రామ అభివృద్ధి పనులు- భూక్యా స్వాతి

On
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం

ఖమ్మం మార్చి 17 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: రఘునాధపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన సర్పంచ్ భూక్యా స్వాతి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.సర్పంచ్ భూక్యా స్వాతి, ఉప సర్పంచ్ బోడ రాజా మాట్లాడుతూ..గ్రామంలో రూ. 38.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా, పలు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. వీధిలైట్లు ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ శుభ్రత పనుల్లో వేగం పెంచడం ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు.భవిష్యత్తులో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.మంత్రి తుమ్మల, యువ నాయకులు యుగేందర్ ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో పంగిడి గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.

IMG_20260317_171313

Views: 20
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News