టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 

On
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ఇందు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం, మామిడి తోట కాలనీకి చెందిన అప్పం రితీష్(16) శ్రీ చైతన్య స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల సమీపించడంతో పాస్ అవుతానో లేదో అని మనోవేదనతో శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి మౌనిక ఇచ్చిన పిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*స్థానికుల సమాచారం మేరకు *

గత కొద్దిరోజుల క్రితం తోటి విద్యార్థులతోని చిన్నచిన్న విభేదాలతో పాలకేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థి రితీష్ ను భజన మందిర్ దగ్గరలోని శ్రీ చైతన్య మరో బ్రాంచ్ కు మార్చడంతో గత కొద్ది రోజులుగా మనోవేదన చెందుతున్నట్లుగా తెలుస్తుంది. కారణం ఏమైనాపటికి తండ్రి లేకుండా తల్లి మిషన్ కుట్టుకుంటూ కొడుకుని పెంచుకొని ప్రయోజకుడ్ని చేయాలనుకుంటే విధి వక్రీకరించి ఒక తల్లికి కడుపు కోతను మిగిల్చి ఒంటరిదాని చేసింది.

Views: 283
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..