అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
సర్పంచ్ మంథని శివ యాదవ్..
On
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..
రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం అస్మాతపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. గ్రామానికి చెందిన కాళ్ళ జగన్‌కు మంజూరైన ఈ ఇంటిని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో సర్పంచ్ మంథని శివ యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంథని వెంకటేష్, కాళ్ళ నర్సింహా, కాళ్ళ గిరీష్, కొత్త శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Views: 30
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Apr 2026 07:03:47
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...

Comment List