రోడ్లు , ఇసుక వాగు పై బ్రిడ్జిలు నిర్మించాలి

On

గొందిగూడెం ,మనుబోతుల గూడెం రోడ్లు , ఇసుక వాగు పై బ్రిడ్జిలు నిర్మించాలి న్యూడెమోక్రసీ డిమాండ్ గొందిగూడెం వద్ద ఇసుక వాగు చప్టా పై న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్ట్ 30 పినపాక నియోజకవర్గ న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక అశ్వాపురం మండలంలోని గొందిగూడెం నుండి మనుబోతుల గూడెం వరకు, మరోవైపు గొందిగూడెం నుండి మామిళ్ళ వాయి వరకు, ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 25 గ్రామాలకు నిరంతరం రాకపోకలకు తీవ్ర […]

గొందిగూడెం ,మనుబోతుల గూడెం రోడ్లు , ఇసుక వాగు పై బ్రిడ్జిలు నిర్మించాలి

న్యూడెమోక్రసీ డిమాండ్

గొందిగూడెం వద్ద ఇసుక వాగు చప్టా పై న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్ట్ 30 పినపాక నియోజకవర్గ న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక

అశ్వాపురం మండలంలోని గొందిగూడెం నుండి మనుబోతుల గూడెం వరకు, మరోవైపు గొందిగూడెం నుండి మామిళ్ళ వాయి వరకు, ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 25 గ్రామాలకు నిరంతరం రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఉన్న ఇసుక వాగు పై ఆరు చోట్ల, తుమ్మలచెరువు వాగు పై ఒకచోట బ్రిడ్జి లు నిర్మాణంతో పాటు, రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం అశ్వాపురం మండలం గొందిగూడెం సమీపంలో ఇసుక వాగు వద్ద న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇసుక వాగు పై బ్రిడ్జిల నిర్మాణం తో పాటు, రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు ఈ సందర్భంగా మోరా రవి రాస్తారోకో లో పాల్గొని ప్రసంగిస్తూ.. పూర్తిగా ఆదివాసి ప్రాంతమైన మారుమూల అడవి గ్రామాల నుండి ప్రజలు తమ అవసరాల కోసం నిరంతరం అశ్వాపురం మండల కేంద్రంతో పాటు, వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారని, ఈ గ్రామాల ప్రజలకు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే మండల కేంద్రానికి వెళ్లి రావడం లేదా పక్క గ్రామానికి వెళ్లి రావడం కూడా కత్తి మీద సాము చేయడం వంటి సాహసంతో కూడిన ప్రయాసగా మారిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ప్రతి సంవత్సరం తమ ఆవేదనను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకోవడం, వారు పెడచెవిన పెట్టడం, షరా మామూలుగా మారిందని పేర్కొన్నారు. పత్రికలు మీడియాలో అనేక కథనాలు వచ్చినప్పటికీ పట్టించుకున్న నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి ఎన్నికల సందర్భంలో ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్ప పరిష్కారానికి అధికార యంత్రాంగం కానీ, నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు కానీ, చిత్తశుద్ధితో పనిచేయలేదని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికార యంత్రాంగం దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి పూనుకోకుంటే న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలతో కలిసి సమస్య పరిష్కారానికి దశలవారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి బండ్ల వెంకటేశ్వర్లు, పావురాల లాలయ్య, మడకం మల్లయ్య, గొంది వెంకటయ్య , శర్ప నాగేంద్రబాబు, నారాయణ, పద్మ, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 6
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్