వైద్యుల నిర్లక్ష్యంతో.. నిండు ప్రాణం బలి...

వనస్థలిపురం తన్వి హాస్పటల్లో ఘటన...

On
వైద్యుల నిర్లక్ష్యంతో.. నిండు ప్రాణం బలి...

వైద్యుల నిర్లక్ష్యంతో..
నిండు ప్రాణం బలి...

అనస్తేషియా హైడోస్..

వనస్థలిపురం తన్వి హాస్పటల్లో ఘటన...

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, సెప్టెంబర్ 20, న్యూస్ ఇండియా ప్రతినిధి: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ముక్కుపచ్చలారని చిన్నారిని వైద్యం కోసం తీసుకువచ్చిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లికి చెందిన ధ్యానమొయిన శేఖర్, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కూతురు. కూతురు ధ్యానమొ

Read More 900కు పైగా సినిమాలు.. రూ.100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు ఎవరో తెలుసా?

IMG-20250920-WA0590
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన ధ్యానమొయిన నిహారిక..

యున నిహారిక (11) గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు 10 రూపాయల నాణెం మింగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వనస్థలిపురం లోని హుడా సాయి నగర్ కమాన్ వద్ద ఉన్న తన్వి హాస్పిటల్ కు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి సర్జరీ చేసిన వైద్యులు నిహారిక మింగిట 10 రూపాయల కాయిన్ ను తొలగించారు. అనంతరం మరుసటి రోజు ఉదయం (శుక్రవారం) 5 గంటల సమయంలో పేషెంట్ పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత శుక్రవారం సాయంత్రం మళ్లీ నిహారిక అస్వస్థతకు గురైంది. వెంటనే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు తిరిగి నిహారికను తన్వి హాస్పిటల్ కు తీసుకువచ్చారు. తన కూతురిని కాపాడాలని హాస్పిటల్ వైద్యులను సిబ్బందిని వేడుకున్నారు. కానీ హాస్పిటల్ యాజమాన్యం  నిహారికను తిరిగి అడ్మిట్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తాము ఏమి చేయలేమని ఇతర హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇంతలోనే పాపం పసి ప్రాణం గాలిలో కలిసిపోయింది. 

Read More పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు.. ఏకంగా సగానికి సగం ఢమాల్!

*అనస్తీషియా హైడోస్..*

Read More భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?

హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని నిహారిక తల్లిదండ్రుల రోదనలు పలువురిని కలిచి వేశాయి. 10 రూపాయల నాణెం తొలగించేందుకు అనుభవం లేని డాక్టర్లు అనస్తేషియా డోస్ ఎక్కువగా ఇవ్వడం వల్లనే చిన్నారి నిహారిక తీవ్ర అస్వస్థతకు గురైందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన్వి హాస్పిటల్ నిర్వాహకుడు రాము అనే వ్యక్తిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ లో గర్భస్థ పరీక్షలు నిర్వహించి అబార్షన్లు కూడా చేస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిహారిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Views: 27

About The Author

Post Comment

Comment List

Latest News

లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా? లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్‌లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్‌లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?