వేసవి సెలవులలో ఊరెళ్తున్నారా.. జరభద్రం..  సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ.

On
వేసవి సెలవులలో ఊరెళ్తున్నారా.. జరభద్రం..  సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ.

WhatsApp Image 2025-04-28 at 6.13.48 PMసంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 28, న్యూస్ ఇండియా : ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ సూచించారు. ఈ సందర్బంగా వేసవి సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలలకు సెలవులు రావడంతో చాలా వరకు తమ సొంత గ్రామాలకు కానీ, ఇతరప్రాంతాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు. కాబట్టి, ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారాని, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ సూచించారు.  

దొంగతనాల నియంత్రణకు జిల్లా ప్రజలకు పోలీసు వారి సూచనలు: 
•ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. 
•ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి. 
•ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. 
•ఊళ్ళకు వెళ్లే వారు ఇంటి లోపల, ఇంటి బయట ఒక లైటు వేసి ఉంచాలి.
•విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. 
•ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.
•ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
•సిసి కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తే మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా  ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. 
•ఇండ్లలో నుండి బయటకు వచ్చే ముందు గ్యాస్ లివర్ తప్పనిసరిగా ఆఫ్ చేయడం, షార్ట్ సర్కుట్ కాకుండా జాగ్రతలు పాటించాలి. 
•ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి.
•అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి.
•సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వెళుతున్నట్లైతే, సమీప పోలీసు స్టేషన్ లలో మీ ఫోన్ ఇచ్చి వెళ్లాలని, తద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితులలో నైనా గుర్తించడానికి వీలుగా ఉంటుంది. 
•ప్రయాణాలలో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, జాగ్రతగా వాహనాలను నడుపుతూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని జిల్లా ఎస్‌పి సూచించారు.

Views: 7
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News