ప్రజావాణికి 63 దరఖాస్తులు

On
ప్రజావాణికి 63 దరఖాస్తులు

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 21, న్యూస్ ఇండియా : జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) చంద్రశేఖర్  సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 63  మంది దరఖాస్తుదారులు  తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. రెవెన్యూ శాఖ 35 , పౌరసరఫరాల శాఖ 02, సర్వే ల్యాండ్ 4, పంచాయతీ & పి టి విభాగం 3, పంచాయతీరాజ్ 2, డి.ఆర్.డి.ఓ 4, మున్సిపల్ 3, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3, వ్యవసాయ శాఖ 4, పశు సంవర్ధక శాఖ 3,  వచ్చాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజల ప్రధాన సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  డీ.ఆర్‌.ఓ పద్మజ రాణి, ఏవో అంటోని సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-21 at 4.01.40 PM

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్ గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
ఖమ్మం మార్చి 17 ఖమ్మం న్యూస్ ప్రతినిధి రఘునాధపాలెం మండలం మంగ్యతండా గ్రామానికి చెందిన మాలోత్ భార్గవి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. గతంలో...
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్