వివిధ కుల, మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

అనవసర రూమర్స్ ప్రచారం చేసి, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.. శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులకు సహకరించాలి. -జిల్లా శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

On
వివిధ కుల, మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 26, న్యూస్ ఇండియా : జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా వివిధ కుల, మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని గుడులు, మసీదులు, చర్చిలు మరియు ఇతర కుల సంఘాల వద్ద అత్యాధునిక హై-రెజల్యూషన్ సిసి కెమెరాలు మరియు కనీసం 1 నెల రోజుల రికార్డింగ్ సామర్థ్యంతో కూడిన డీవీఆర్ లు అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇది ఆయా మత సంఘాల కమిటీ ఇన్‌చార్జ్‌ల బాధ్యత అని అన్నారు. సిసి కెమెరాలు నేరాలను నివారించడంలోనే కాదు, జరిగిన నేరాలను ఛేదించడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయని ఎస్పీ తెలియజేశారు. ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుందని, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులకు సహకరించవలసిందిగా సూచించారు. వాస్తవాలను తెలుసుకోకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని, అట్టి వ్యక్తులపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా శాంతి భధ్రతల సమస్యలు తలెత్తే సంఘటనలు ఎదురైనప్పుడు ఎంటనే సమీప పోలీసు స్టేషన్ లో సమాచారం అంధించాలే గాని ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు.  సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యల చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినా చట్టరిత్య కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.WhatsApp Image 2025-04-26 at 5.41.27 PM

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు