వివిధ కుల, మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
అనవసర రూమర్స్ ప్రచారం చేసి, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.. శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులకు సహకరించాలి. -జిల్లా శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 26, న్యూస్ ఇండియా : జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా వివిధ కుల, మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని గుడులు, మసీదులు, చర్చిలు మరియు ఇతర కుల సంఘాల వద్ద అత్యాధునిక హై-రెజల్యూషన్ సిసి కెమెరాలు మరియు కనీసం 1 నెల రోజుల రికార్డింగ్ సామర్థ్యంతో కూడిన డీవీఆర్ లు అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇది ఆయా మత సంఘాల కమిటీ ఇన్‌చార్జ్‌ల బాధ్యత అని అన్నారు. సిసి కెమెరాలు నేరాలను నివారించడంలోనే కాదు, జరిగిన నేరాలను ఛేదించడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయని ఎస్పీ తెలియజేశారు. ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుందని, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులకు సహకరించవలసిందిగా సూచించారు. వాస్తవాలను తెలుసుకోకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని, అట్టి వ్యక్తులపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా శాంతి భధ్రతల సమస్యలు తలెత్తే సంఘటనలు ఎదురైనప్పుడు ఎంటనే సమీప పోలీసు స్టేషన్ లో సమాచారం అంధించాలే గాని ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యల చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినా చట్టరిత్య కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List