సంగారెడ్డి జిల్లా కలెక్టర్ విఫలం!
• విధుల్లో చేరినప్పుడు చేసిన హెచ్చరికలకు తిలోదకాలు!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 25, న్యూస్ ఇండియా : పిఆర్జిఐ, అర్ఎన్ఐ దరఖాస్తులను పరిశీలించి ముందుకు తీసుకోపోవడంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పూర్తిగా విఫలం చెందారు. భారతదేశంలో క్రొత్తగా వార్త పత్రికల రిజిస్ట్రేషన్ నమోదు చేయడానికి ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ అఫ్ ఇండియా (పిఆర్జిఐ), రిజిస్ట్రార్ అఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (అర్ఎన్ ఐ) అని పిలువబడే ప్రభుత్వ సంస్థ లో రిజిస్ట్రేషన్ కొరకై నమోదు చేసుకోవలసి ఉంటుంది. సంబంధిత దరఖాస్తుదారుల దరఖాస్తులను తరువాతి ప్రక్రియ కొరకై ముందుకు తీసుకుని వెళ్లడానికి కేవలం జిల్లా కలెక్టర్ కు మాత్రమే లాగిన్ యాక్సెస్ అర్హత కలిగి వుంటారు. సంబంధిత 'సి' సెక్షన్ ఉద్యోగులు గందరగోళ పరిస్థితులలో వున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నప్పుడు జిల్లా యంత్రాగాన్ని విధుల్లో అలసత్వం ప్రదర్శించొద్దని చక్కటి సూచనలతో పాటు హెచ్చరికలు కూడా చేశారు. జిల్లా యంత్రాంగం మాత్రం జిల్లా కలెక్టర్ హెచ్చరికలు ఏమాత్రం పట్టించుకోలేదు అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రజల ‘దరఖాస్తుల పట్ల చిత్తశుద్ధి చూపించకపోవడం’ అనే జబ్బు ఈ శాఖతో సహా ఇతర శాఖలలో కూడా కొనసాగుతున్న విషయాన్నీ కలెక్టర్ దృష్టికి రాకపోవడం ప్రజల చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గా విధుల్లో చేరినప్పుడు ప్రభుత్వ అధికారుల పట్ల చేసిన హెచ్చరికలకు తిలోదకాలు పలికిన పరిస్థితులు స్పష్టమవుతున్నాయి.
Comment List