జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
ఉపాధ్యాయులకు ఘనంగా పూలతో సత్కారం
*విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ*
*జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు వేడుకలు**
*న్యూస్ ఇండియా తెలుగు, పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్,*
*సెప్టెంబర్ 11,*
పాలకుర్తి మండల కేంద్రంలోని
కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఇందులో విద్యార్థులే ఉపాధ్యాయులుగా ఉండి చిన్న తరగతుల పిల్లల కు పాటలు బోధించడం జరిగింది.తర్వాత విద్యార్థులు ప్రిన్సిపాల్ లిజ్ బెత్ గారిని ఉపాధ్యాయులను మరియు సర్వేపల్లి రాధాకృష్ణ గారు టీచర్ గా అందించిన సేవలు అమోగమైనవని ఆయన ఫోటోను పూలతో సత్కరించారు.కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ లీజ్ బెత్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చి దిద్ది ఉన్నత శిఖరాలకు పంపిస్తారు కానీ ఉపాధ్యాయులు మాత్రం అలానే ఉండిపోతారని ఈ వృత్తి అనేది చాలా సహనంగా వ్యవహరించేది అని అందుకే విద్యార్థులు భవిష్యత్తులో మంచి నడవడికతో ఉండి అన్ని రంగాల్లో ముందు ఉండాలని అన్నారు.ఇందులో పాల్గొన్న విద్యార్థులకు మొదటి బహుమతిని ద్వితీయ బహుమతిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లు అందరూ పాల్గొనడం జరిగింది.
Comment List