సరూర్నగర్ లో దారుణం..

అర్ధరాత్రి ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తను చంపిన భార్య...

On
సరూర్నగర్ లో దారుణం..

IMG_20250829_211250
మృతుడి ఫైల్ ఫోటో...

సరూర్నగర్లో దారుణం..

అర్ధరాత్రి ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తను చంపిన భార్య..

ఎల్బీనగర్, ఆగస్టు 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరామ్నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ కు చెందిన శేఖర్-చిట్టికి 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి కోదండరామ్నగర్లో నివాసం ఉంటున్నారు. శేఖర్ వృత్తిరీత్యా డ్రైవర్ కాగా, చిట్టి ఇళ్లలో పనిచేస్తోంది. వివాహేతర సంబంధంపై భర్త నిలదీయడంతో హత్యకు కుట్ర పన్నింది. అర్ధరాత్రి ప్రియుడిని ఇంటికి పిలిపించి అతని సాయంతో నిద్రలో ఉన్న భర్త శేఖర్ ను హతమార్చింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు డయల్ 100కు ఫోన్ చేసి నిద్రలోనే తన భర్త చనిపోయినట్టు చెప్పింది. భార్య పై అనుమానం వచ్చి పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం అంగీకరించింది. చిట్టి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు హరీశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Views: 0

About The Author

Post Comment

Comment List

Latest News

వృద్ధాశ్రమం కి చేయూత.. వృద్ధాశ్రమం కి చేయూత..
వృద్ధాశ్రమం కి చేయూత.. 5000/- రూపాయల చెక్కును అందజేసిన లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్.. లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ తరపున 5000/- చెక్కును...
సరూర్నగర్ లో దారుణం..
జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’
హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రం లోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ లో
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లోనీ
శ్రీ నిత్య హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి..