నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి సహకరించండి 

కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు 

On
నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి సహకరించండి 

 భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ ) చండ్రుగొండ దమ్మపేట మండల కేంద్రాల్లో నూతన గ్రంథాలయ భవనాల నిర్మాణం కొరకు సహకరించాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత రోజుల్లో గ్రంథాలయాలకు మరింత ఆదరణ పెరిగిందని, పోటీ పరీక్షలకు సిద్ధపడే యువత పెద్ద ఎత్తున గ్రంథాలయాల పై ఆధారపడి చదువుకుంటున్నారని చెప్పారు. వారికి సరైన వసతులు కల్పిస్తే మరింతగా అభివృద్ధి పథంలో సాగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ సమన్వయంతో ముందుకు సాగుతూ నూతన భవనాలను నిర్మించుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వాసం రాణి,మండల నాయకులు వాసం శ్రీను, చిన్ని, చెట్టి యువజన నాయకులు, భవన నిర్మాణ దాత కక్కిరాల రమేష్,చిట్టిబాబు, పగడాల రాంబాబు, అత్తులూరి రాంబాబు మాజీ సర్పంచ్,శివ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 15
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి ఎమ్మెల్యే మేఘారెడ్డి* కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి ఎమ్మెల్యే మేఘారెడ్డి*
*కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి; ఎమ్మెల్యే మేఘారెడ్డి*   *శ్రీరంగాపూర్:న్యూస్ ఇండియా* శ్రీ రంగాపూర్ మండల పరిధిలోని నాగసాని పల్లి గ్రామంలో గొల్లవాల గోవిందమ్మ భర్త...
*కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి; ఎమ్మెల్యే మేఘారెడ్డి*
భాగ్యనగర ప్రజల ఐక్యతకు, సాంప్రదాయాలకు నిదర్శనం - గణేశ్ నవరాత్రి సంబరాల వైభవం.
*మంత్రులను కలిసన శ్రీరంగాపూర్& పెబ్బేరు కాంగ్రెస్ నాయకులు*
నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి సహకరించండి 
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ద్భావన దివాస్
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సద్భావన దివాస్