63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..
పర్యావరణహితమైన మట్టి గణనాథులను ఏర్పాటు చేయాలని సూచన..
63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..
పర్యావరణహితమైన మట్టి గణనాథులను ఏర్పాటు చేయాలని సూచన..
ఎల్బీనగర్, ఆగస్టు 17, న్యూస్ ఇండియా ప్రతినిధి: -

వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగోల్ సమతాపురి కాలనీలో ఏర్పాటు చేస్తున్న 63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీ గౌడ్ ఆదివారం సందర్శించారు. 19 ఏళ్లుగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. పర్యావరణ సహితమైన మట్టి గణనాధుని ఏర్పాటు చేయడం అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా మధుయాష్కి పేర్కొన్నారు. పకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. రానున్న వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని అందరూ మట్టి గణపతిని ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, నాయకులు కొండోజు శ్రీనివాస్, దాము మహేందర్ యాదవ్, రమేష్, నాగార్జున రెడ్డి , తిరంగా యూత్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comment List