ప్రజలందరు అప్రమత్తం వుండాలి...

హయత్ నగర్ ఎస్.హెచ్.ఓ పల్స  నాగరాజు గౌడ్..

On
ప్రజలందరు అప్రమత్తం వుండాలి...

ప్రజలందరు అప్రమత్తం వుండాలి..

హయత్ నగర్ ఎస్.హెచ్.ఓ పల్స  నాగరాజు గౌడ్..

Screenshot_2025-08-13-08-31-04-17_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
హయత్ నగర్ ఎస్.హెచ్.ఓ పల్స  నాగరాజు గౌడ్..

ఎల్బీనగర్ ఆగస్టు 13 న్యూస్ ఇండియా ప్రతినిధి: - రానున్న 72 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు. కావున   ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హయత్ నగర్ సీఐ ప్రజలకు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని అలాగే శిథిలావస్థలో వున్న భవనాలు, ఇండ్లల్లో నివసించే వారు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సీఐ సూచించారు. భారీ వర్షాల కారణంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేస్తూ అత్యవసరం ఉంటేనే బయటకు రావాలి, వాతావరణంలో మార్పులకు అనుగుణంగా, పనులు షెడ్యూల్ చేసుకోవాలని, వర్షంలో వాహనం పై ప్రయాణించే వారు వాహనాల కండీషన్ పరిశీలించుకోవాలని, వాహనదారులు నిదానంగా డ్రైవింగ్ చేయాల్సివుంటుందని, అలాగేభారీ వర్షాలున్నప్పుడు బయటకు రావొద్దని, ముఖ్యముగా వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద నిలబడటం ప్రమాదకరమని, విద్యుత్ స్థంబాల దగ్గర్లో నిలబడటం, తాకడం చేయద్దని సీఐ ప్రజలకు సూచించారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా అత్యవసర సహాయం కొరకు డైల్ 100 &8712662301 కు పోన్ చేయగలరు.

Views: 32

About The Author

Post Comment

Comment List

Latest News