చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య భాష పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ..తాము ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌లో తనకంటూ శక్తివంతమైన గుర్తింపు సాధించడానికి ప్రజాసేవే ఆయుధంగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు.గ్రామ ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఎప్పుడైనా అవసరమొస్తే ప్రజలకు ముందుండి సహాయం చేసి నడిపించామని తెలిపారు.ఈ ఎన్నికల్లో తమకు పూర్తి మెజార్టీ రావడం ఖాయమని, ప్రజలు ఇప్పటికే తమ గెలుపుకే ఎదురుచూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిచి గ్రామ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తాను” అని భుక్య భాష విశ్వాసంతో అన్నారు.


Comment List