సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ 

కొత్తగూడెం క్లబ్లో అరైవ్ అలైవ్ కార్యక్రమం

On
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ 

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ

IMG20260224150655కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 24:కొత్తగూడెం క్లబ్లో మంగళవారం డి.ఎస్.పి ఆదినారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ  రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ, డిఎస్పి మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలోకి రావాలని, చెడు మార్గంలో నడుచుకొని ఏదైనా పోలీస్ కేసు నమోదయ అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, వీసాలు పొందటానికి కోల్పోతారని తెలిపారు. ఎన్డిపిఎస్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అని అన్నారు. ఎవరైనా సైబర్ నేరం బారిన పడితే 1930 కి ఫోన్ చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి సివిక్స్ సెన్స్ అలవర్చుకోవాలన్నారు. మన ఇంటి వరకే కాదు సమాజానికి కూడా మన ద్వారా మార్పు రావాలన్నారు. ఇతర దేశాలలో బుల్లెట్ ట్రైన్ గంటకు 630 కిలోమీటర్ల వేగంతోని ప్రయాణిస్తు టెక్నాలజీ అభివృద్ధి చెందిందని తెలిపారు. మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ మిమిక్రీ విద్యార్థులను అలరించింది. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిఐలు కరుణాకర్, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు రమణారెడ్డి, రమాదేవి, ప్రవీణ్ కుమార్, విజయ,ఉమా, కిషోర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 99
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..