ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన

ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన

మహబూబాబాద్ జిల్లా – తొర్రూరు మున్సిపాలిటీ

ఈ సందర్భంగా పంజా కల్పన మాట్లాడుతూ—
తాను గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సేవాభావంతో పనిచేసినప్పటికీ,
పార్టీలోగానీ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రస్ట్ వ్యవహారాల్లోగానీ,
మహిళా సంఘాల కార్యకలాపాల్లోగానీ తన సేవలకు సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“పార్టీ కోసం పనిచేసిన మహిళలను పక్కనపెట్టి, వారి సేవలను విస్మరించడం సరైంది కాదు.
ఇది ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇప్పటి పరిస్థితుల్లో మహిళల గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టిన నాయకత్వంగా
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి,
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిలను పేర్కొంటూ,
వారి ప్రోత్సాహంతోనే తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.
9వ వార్డులో తనను గెలిపిస్తే,
మహిళల సమస్యలపై పోరాటం చేస్తూ,
ప్రజలతో కలిసి నిజమైన అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆడబిడ్డకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీకి,
మహిళా నాయకత్వాన్ని గెలిపించే అవకాశం ఇవ్వాలని
వార్డు ప్రజలను పంజా కల్పన విజ్ఞప్తి చేశారు.

Views: 11
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత