కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

అనుబోస్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహణ

On
కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లలో తీవ్ర ఉత్కంఠం

IMG-20260213-WA0460కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 13:తెలంగాణలో మున్సిపల్‌, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలపై నేడు స్పష్టత రానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం వార్డు వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసి, సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది.కౌంటింగ్ హాళ్లలో అభ్యర్థులు, అనుమతులు ఉన్న ఏజెంట్లకే ప్రవేశం ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి తొలి ఫలితాలు వెలువడే అవకాశం ఉండగా, సాయంత్రానికి పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోలింగ్ ఫిబ్రవరి 11న జరగగా, నేడు ఫలితాలు ప్రకటించనున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ పాల్వంచ అనుబోస్ కళాశాలలో నిర్వహిస్తున్నారు.ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Views: 63
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత