సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు... యువకుడు నవీన్ ప్రాణం బలి..

అంబులెన్స్ లో ఎస్కార్ట్ లేకుండా హైదరాబాద్ కు రిఫర్ చేసారు

On

ఊపిరాడక మార్గమధ్యంలోనే ప్రాణంవదిలిన వైనం

కొత్తగూడెం (న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 14:కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా సింగరేణి ఉద్యోగి కుమారుడి ప్రాణం బలి అయింది. సింగరేణి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని ఎమర్జెన్సీ కేసులను సైతం హైదరాబాదులోని పెద్ద ఆసుపత్రుల్లో ఆధునిక చికిత్సలు అందిస్తున్నట్లు యాజమాన్యం ప్రచారం చేయడం తప్ప కార్య రూపంలో శూన్యంగా కనిపిస్తుంది. కొత్తగూడెం 5 షాఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న సింగరేణి ఉద్యోగి బాల నాగేశ్వరరావు కుమారుడు నవీన్ (29) స్థానిక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శనివారం మరణించాడని ఆరోపణలు వస్తున్నాయి. మూడేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన్ ను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటూ తనయుణ్ణి కాపాడుకునేందుకు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. సింగరేణి అందిస్తున్న వైద్యంపై భరోసాతో డాక్టర్ల ప్రతి సూచనలు పాటిస్తూ వస్తున్న ఆ కుటుంబానికి వైద్యుల నిలువెత్తు నిర్లక్ష్యం షరాఘాతంగా మారింది. నవీన్ ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర కడుపుకోతకు గురైన ఆ కుటుంబంతో పాటు ఏఐటీయూసీ గుర్తింపు సంఘం నాయకులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సింగరేణి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. నవీన్ ఆరోగ్యం చేనుంచటంతో ఇక్కడి ప్రధాని ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లో చికిత్స కోసం రిఫర్ చేశారు. ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ లో తరలిస్తున్న క్రమంలో ఖమ్మం సమీపంలోని పల్లిపాడు వద్ద ఊపిరి ఆడక అంబులెన్స్ లోనే నవీన్ చాలా విషాదంగా మృతి చెందాడు. అత్యవసర పరిస్థితి ఉందని వైద్యులకు తెలిసినప్పటికీ ఆక్సిజన్ ఆపరేటర్స్ ఏర్పాటు చేయలేకపోయారు. దానికి తోడు అంబులెన్స్ లో ఏసీ కూడా పని చేయడం లేదని విమర్శలు. అసలే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న నవీన్ వెంట కనీసం ఒక వైద్య చికిత్సలో తర్ఫీదు ఉన్న ఎస్కార్ట్ ను పంపించాల్సి ఉంది. బీటెక్ చదువుకున్న నవీన్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తోంది. దానికి తోడు బోన్ క్యాన్సర్ కూడా సంక్రమించినట్లు తెలిసింది. ఇతనికి కీమో చికిత్సలు కూడా పూర్తిస్థాయిలో అందాయి. ఎంతో కొంత కోరుకుంటున్నా దశలో హైదరాబాద్ వైద్యుల సూచన మేరకు హ్యుమానిటీ ఇంజక్షన్లు ఇవ్వాల్సిందిగా సింగరేణి వైద్యులకు సూచనలు చేసారని అయినప్పటికీ నిర్లక్ష్యం చేశారని సచేమీరా ఆ ఇంజక్షన్లు చేయమని వైద్యులు తిరస్కరించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొడుకును ఎంతో గారాబంగా చూసుకుంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలలుగన్న తల్లిదండ్రుల ఆశలను సింగరేణి వైద్యులు తమ నిర్లక్ష్యంతో కడుపుకోతను మిగుల్చారని విమర్శలు వస్తున్నాయి. మూడేళ్లుగా చికిత్స తీసుకుంటున్న నవీన్ ఎంతో కొంత కోరుకుంటున్నారని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇలాంటి క్రిటికల్ కేసుల విషయంలో అంబులెన్స్ ఏర్పటు శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా చాలా నిర్లక్ష్యం చేశారని దీంతో యువకుడి ప్రాణాలు కోల్పోయాడని గుర్తింపు సంఘం నాయకులు వంగ వెంకట్ హుమాయున్ ఆరోపిస్తున్నారు. యువకుడి శవంతో సింగరేణి ఆసుపత్రి వద్ద నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వీరు మద్దతుగా నిలబడ్డారు. ఎమర్జెన్సీ కేసు విషయంలో అంబులెన్స్ లో సి ఆర్ పి తో పాటు ఆక్సిజన్ ఆన్ చేసి ఉంచాలని ఒక తర్ఫీదు పొందిన సిబ్బంది ఎస్కార్ట్ గా పంపించాల్సి ఉంటుందని నాయకులు వెల్లడిస్తున్నారు. స్థానిక వైద్యులు ఇవేమీ పట్టించుకోకుండా ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని అందుకే యువకుడు నవీన్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తున్నారు.ఈ కార్యక్రమంలో లో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్,బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,కేంద్ర కౌన్సిల్ సభ్యులు హుమాయూన్,రాము,రాజేశ్వరరావు,నరేష్,మురళి,రవీందర్, శ్యామ్,పల్నాటి ప్రశాంత్, నాగయ్య,నితిన్,క్రిస్టఫర్,ఎర్రగాని కృష్ణ,ఓం,వాసు,మడిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 218
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News