కలిసి కట్టుగా ముందుకు సాగుతాం :కూనంనేని 

కార్పోరేషన్ అభివృద్ధే తన ధ్యేయం

On

నూతన పాలక వర్గానికి అభినందనలు

IMG-20260216-WA1146కొత్తగూడెం (న్యూస్ ఇండియా) : కార్పోరేషన్ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు తెలిపారు. కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎకగ్రీవ ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాత నగర్లోని కొంత ప్రాంతం కలుపుకుని కార్పోరేషన్గా ఏర్పడిందని, ఆ కార్పోరేషన్కు ఈనెల 11న ఎన్నికలు జరగగా, 13న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని చెప్పారు. చిన్నచిన్న బేదాభిప్రాయాల కారణంగా సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా స్నేహపూర్వక పోటీలో భాగంగా ఎన్నికల్లోకి వెళ్లినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో సిపిఐ 22 డివిజన్ల వ్యాప్తంగా విజయం సాధిచడంతో పాటు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలిపిన స్వతంత్ర కార్పోరేటర్తో కలిసి మొత్తం 23 సీట్లు సాధించామ న్నారు. సిపిఐకి చెందిన మూడ్ గణేష్ మేయర్, కాంగ్రెస్కు చెందిన సిరిపురపు లలిత కుమారి డిప్యుటీ మేయర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. నూతనంగా ఏర్పడిన కార్పోరేషన్ ఎంతో అభివృద్ధి చెందనుందని హైదరాబాద్ తర్వాత అంతటి విశిష్టత ఇక్కడ ఉందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి మరింతగా జరుగుతుందని, పెద్దపెద్ద కంపెనీలు ఇక్కడికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రజల ఆర్ధిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని, త్వరలో విమానాశ్రయంతో పాటు, పెద్దపెద్ద పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. రాగద్వేషాలకు, పార్టీలు, వ్యక్తులు, శక్తులకు అతీతంగా అభివృద్ధే ధ్యేయంగా అభివృద్ధికి పాటుపడతామని, సానుకూల దృక్పదంతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలపడంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలికి, మేయర్, డిప్యూటీ మేయర్లకు అభినందనలు తెలిపారు. సుపరిపాలన దిశగా ముందుకు సాగాలని, కార్పోరేషన్ అభివృద్ధే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుని చక్కటి పాలనను ప్రజలకు అందించాలని కూనంనేని సూచించారు.

Views: 108
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News