#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

#Draft: Add Your Titleతొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

IMG_20260205_125332 మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెద్దగాని కళావతి సోమన్న ని అత్యధిక ఓట్లతో గెలిపించాలని పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు ప్రజలకు పిలుపునిచ్చారు..

ఈ సందర్భంగా *ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను నేరుగా అర్థం చేసుకొని పరిష్కరించే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని వారు పేర్కొన్నారు..

పెద్దగాని కళావతి సోమన్న ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉన్న నాయకురాలన్నారు. ఆమెను భారీ మెజారిటీతో గెలిపిస్తే, 06వ వార్డులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తారని భరోసా ఇచ్చారు..

అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రతి వార్డు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. 06వ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తైన చేతి గుర్తుకు ఓటు వేసి, పెద్దగాని కళావతి సోమన్నని గెలిపించి అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు..

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దగాని కళావతి సోమన్న, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Read More అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..

Views: 8
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత