కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

On
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

IMG-20260225-WA0806
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం ర్యాలీ, డిమాండ్..

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 25, న్యూస్ ఇండియా ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో పసిబిడ్డను కాలితో తన్ని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ఈ అమానుష ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్ డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామెల్ మాట్లాడుతూ, నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఈ దారుణం అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. పసిబిడ్డను హత్య చేసిన వారిపై అత్యాచార నిరోధక చట్టంతో పాటు హత్య కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేశారు. కుమ్మరి మల్లన్న జాతర సందర్భంగా జరిగిన ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమేనని ఆరోపించారు. ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో పోలీసులు, అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శించారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎస్సై, సీఐలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి సముచిత న్యాయం చేయాలని సీపీఎం నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, మండల కార్యదర్శి సీహెచ్ బుగ్గరాములు, జిల్లా కమిటీ సభ్యులు గోరెంకల నర్సింహా, డి. కిషన్, పి. జగన్, మున్సిపల్ కార్యదర్శి సీహెచ్ ఎల్లెష్, నాయకులు ఎ. వెంకటేష్, ముసిలయ్య, సీహెచ్ శంకర్, పురుషోత్తం, నర్సింహా, స్వప్న, యాదగిరి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..