డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
ఎన్ఐటి మిజోరం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న విద్యావేత్తకు అరుదైన గుర్తింపు..
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
ఎన్ఐటి మిజోరం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న విద్యావేత్తకు అరుదైన గుర్తింపు..
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, నవంబర్ 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని వాసవి రెసిడెన్సియల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాదారం విక్రమ్ గౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) మిజోరం ఆయనకు గౌరవ డాక్టరేట్ (Ph.D)ను ప్రదానం చేసింది.
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో యంత్రాల ఉత్పత్తి, వినియోగం, పనితీరుల మెరుగుదలకు సంబంధించిన పలు ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించినందుకు గుర్తింపుగా విక్రమ్ గౌడ్‌కు ఈ డాక్టరేట్ లభించింది.
“ఎలక్ట్రికల్ వెహికిల్ చార్జ్ షెడ్యూలింగ్ స్టార్ట్ ఆప్టిమైజేషన్” అంశంపై ఆయన రచించిన థీసిస్‌ను డా. ప్రబిత్ర కుమార్ విశ్వాస్, డా. చిరంజీత్ సైన్ పర్యవేక్షణలో పూర్తి చేశారు. ఈ పరిశోధనను సమీక్షించిన ఎన్ఐటి మిజోరం ఆయనకు పీహెచ్‌డీ పట్టాను ప్రకటించింది.
మిజోరం గవర్నర్, వైస్ ఛాన్స్‌లర్ వి.కే. సింగ్, ఎన్ఐటి మిజోరం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. సుందర్ చేతుల మీదుగా విక్రమ్ గౌడ్ డాక్టరేట్ పట్టాను స్వీకరించారు.
“మా ప్రిన్సిపాల్‌కు డాక్టరేట్ రావడంతో కళాశాల గౌరవం పెరిగింది” : వాసవి విద్యాసంస్థల చైర్మన్ రమేష్ గౌడ్..
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగంపేట గ్రామానికి చెందిన ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన విక్రమ్ గౌడ్ ఈ స్థాయికి చేరడం గ్రామానికి, కుటుంబానికి గర్వకారణమని వాసవి విద్యాసంస్థల చైర్మన్ రమేష్ గౌడ్ అన్నారు.
తమ కళాశాలలోనే విద్యను అభ్యసించి, అదే కళాశాలలో ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తూ ఉండటం గర్వకారణమని, ఇప్పుడు అతని ప్రతిభకు గుర్తింపుగా దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలలో ఒకటైన ఎన్ఐటి మిజోరం నుండి డాక్టరేట్ రావడం వాసవి సంస్థలకు గొప్ప పేరు తెచ్చిందన్నారు.
“విక్రమ్ గౌడ్ సాధించిన ఈ విజయం మా విద్యాసంస్థ ప్రతిష్ఠను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది” అని రమేష్ గౌడ్ ప్రశంసించారు. డాక్టరేట్ రావడంతో విక్రమ్ గౌడ్ బాధ్యత మరింత పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని అధ్యయనాలు, పరిశోధనలు చేయడానికి ఇది ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు.

Comment List