శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు...

On
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం..

గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు...

IMG20251026141149
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన పోలీసులు..

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాల నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం, జరియా మండలం, దమ్మన్నగూడ గ్రామానికి చెందిన దివాకర్ బత్ర, అతని తమ్ముడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, శేరిగూడ, శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాలలో రెండు నెలల నుంచి సెంట్రింగ్ కార్మికులుగా పని చేస్తున్నారు. దివాకర్ బత్ర సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి మృతిచెందాడు. నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం చేసింది. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఒడిశా కు తరలించడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహం 300 కిలోమీటర్ల వరకు వెళ్లిన మృతదేహాన్ని పోలీసులు తీసుకురావాలని ఆదేశించడంతో చేసేదేమీ లేక మృతదేహాన్ని తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read More బల్దియా అంటేనే అవినీతి కంపు..!

Views: 2

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..