ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..

On
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..

ఆరుట్ల బుగ్గ జాతరకు పాదయాత్రతో భక్తులు..

IMG-20251112-WA0444
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..

ఇబ్రహీంపట్నం నుంచి ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల పాదయాత్ర..

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, నవంబర్ 12, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం శ్రీ భవాని నాగలింగేశ్వర ఆలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వైపు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం చారిత్రక ప్రాధాన్యమున్న దేవస్థానం. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి. కార్తీకమాసంలో మాత్రమే కాకుండా, ప్రతి రోజు దీప దూప నైవేద్యాలతో సేవలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి,” అని కోరారు. అలాగే యాదాద్రి, చెరువుగట్టు, కొమురవెల్లి, ధర్మపురి, కురుమూర్తి వంటి ప్రసిద్ధ ఆలయాల మాదిరిగానే బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా తెలంగాణలో ప్రాముఖ్యత పొందాలని ఆకాంక్షించారు. భక్తులు పాదయాత్రను స్వాగతిస్తూ సీతారాంపేట్, నోముల, లింగంపల్లి, మంచాల, ఆరుట్ల గ్రామాల భక్త బృందాలు ఘనంగా ఆతిథ్యమిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని దేవాలయాలకు ఇలాంటి పాదయాత్రలు నిర్వహించి ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలనే సంకల్పాన్ని భక్తులు వ్యక్తం చేశారు. ఈ పాదయాత్రలో ఇబ్రహీంపట్నం బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల మహేందర్, కాంగ్రెస్ నాయకులు ముత్యాల సంతోష్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు చీమల కృష్ణా యాదవ్, సూరమోని బాబు సాగర్, హనుమంతు సుదర్శన్, చెనమోని గోపాల్ ముదిరాజ్, పానుగంటి నరేందర్, పంది బుగ్గ రాములు, కాశమన్న నర్సింగ్ రావు, మారోజు యాదగిరి చారి తదితరులు పాల్గొన్నారు.

Views: 19

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర.. ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
ఆరుట్ల బుగ్గ జాతరకు పాదయాత్రతో భక్తులు.. ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర.. ఇబ్రహీంపట్నం నుంచి ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి...
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం