పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఏసీబీకి చిక్కిన టేక్మాల్ ఎస్సై రాజేష్

పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు

రిపోర్టర్ జైపాల్

న్యూస్ ఇండియా (టేక్మాల్ రిపోర్టర్ జైపాల్ నవంబర్ 18) మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. ఒక కేసుకు సంబంధించి రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా, ఎస్ఐ రాజేష్ ఏసీబీకి పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ నుంచి బయటకి పారిపోయాడు. దీంతో ఎస్‌ఐ రాజేష్‌ని వెంబడించి, చివరికి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై రాజేష్ .. ఏసీబీకి చిక్కడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్న మండల ప్రజలు స్థానిక నాయకులు పోలీస్ స్టేషన్ ముందు టపాసులు కాల్చి సంబరాలు.

Views: 41

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే