రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
భారీ మెజార్టీతో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా సరిత బరిలో దిగారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు తాను అండగా ఉంటానని రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే వినని ఆమె అన్నారు.బిఆర్ఎస్ నాయకులు భూక్యా బాబూలాల్,గుండా మనోహర్ రెడ్డి,జే రామాచారి మాట్లాడుతూ.. తమ గ్రామంలో 20 సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీని నడుస్తుందని బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా తమ గ్రామం ఉన్నదని బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని,గ్రామ అభివృద్ధికి స్థలాలు వాటిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని,ఆరు గ్యారంటీలు ఇస్తామని దాన్ని అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎన్నికలలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలని అన్నారు.


Comment List