ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...

రైతులు మన దేశానికి వెన్నెముక - ట్రాక్టర్లు రైతులకు వెన్నెముక.

By Ramesh
On
ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...

 న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

WhatsApp-Image-2025-11-02-at-10.55.04-PM

వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్ 6 న ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవాన్ని నిర్వహించాలని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పాడి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చిన సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించి, ర్యాలీ నిర్వహించారు.ఆనంతరం యూనియన్ అధ్యక్షులు బొడిగం శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ..‌ప్రతి సంవత్సరం నవంబర్ 6 న ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.రైతు లేనిదే రాజ్యం లేదు అని రైతు జీవితంలో ట్రాక్టర్ భాగమైందని,గతంలో ఎద్దులతో వ్యవసాయ పనులు చేపట్టేవారని,ట్రాక్టర్లు మార్కెట్లోకి ప్రవేశించాక ,రైతులు ట్రాక్టర్ లతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టి,ట్రాక్టర్తో కొద్దిపాటి సమయంలో కొన్ని ఎకరాల మేర పొలం సాగుకు సిద్ధం చేస్తున్నారని,పత్తి, వరి తదితర చేలలో క్రిమిసంహారక మందుల పిచికారీకి సైతం వాడుతున్నారని,వరికోతలకు హార్వేస్టర్ వినియోగిస్తున్నారని.ఒక్కోగ్రామంలో సుమారుగా 20 నుంచి 50 వరకు ట్రాక్టర్లు ఉన్నాయని,ఫ్రంట్ బ్లేడ్, వరికోసే యంత్రాలు సైతం ఉన్నాయని, పొలం పనులే కాకుండా ట్రాక్టర్ వినియోగంతో మరెన్నో కమర్షియల్ పనులు చేస్తున్నారని, ఇంటి నిర్మాణానికి ఇసుక, కంకర, మొరం, ఇటుక తదితర ముడి సరుకుల రవాణకు ట్రాక్టర్ల వాడకం పెరిగిందన్నారు.అనంతరం స్వీట్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 214
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం