కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం
•స్థలం కేటాయింపుకు క్యాబినెట్ ఆమోదం
•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి ప్రభుత్వ భూమి ఎకరం కేటాయిస్తూ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పాత భవనం కావడం, అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు చేయాలని మంత్రి తుమ్మలకు డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ 21 ఫిబ్రవరి 2024 న వినతి పత్రం అందజేశారు. దీంతో మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఖమ్మం నగరంలోని బురాన్ పురం లో గల ఎన్ఎస్పి స్థలం సర్వేనెంబర్ 93 లో ప్రభుత్వ భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపారు. నూతన కార్యాలయం నిర్మాణానికి ఎన్.ఎస్పీ లో ఎకరం భూమి కేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన జిల్లా పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లకు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లి విరుస్తుంది.
Comment List