అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
యువత రాజకీయాల్లోకి రావాలి- మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుంది.తండ్రి బాల్ సింగ్ గ్రామంలో ఎస్టి మహిళ అవడంతో తన కూతురు భార్గవిని బరిలోదించారు.గ్రామంలో వారు చేసిన సేవ కార్యక్రమాలకు ప్రజలు ఎటువంటి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.భార్గవి మాట్లాడుతూ.. తాము చేసిన సేవా సేవ కార్యక్రమాలకు ప్రజలు తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.గతంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని 8 లక్షల ఖర్చుతో నిర్మించామని, ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామని,ప్రజలకు ఏ అవసరం వచ్చిన ఆమె ముందుండి నడిపిస్తామని అన్నారు. తనని చూసి యువత రాజకీయాలకు రావాలని ప్రజలకు రాజకీయంపై అవగాహన కల్పించాలని దేశాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. చిన్న వయసులో సర్పంచి కావడం తనకు ఆనందంగా ఉందన్నారు.తనకు తన తండ్రి ఎప్పుడు అండగా ఉంటున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తామని అన్నారు.


Comment List