కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి

కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి అని కాళ్లు మొక్కి మరీ బ్రతిమిలాడుకుంటున్న రైతు

కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి

మహబూబాబాద్ జిల్లా:-

ఓ రైతు అధికారి కాళు మొక్కి యూరియా అడుగుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పిఎసిఎస్ సొసైటీ వద్ద చోటుచేసుకుంది. యూరియా కోసం పడిగాపులు కాసి  ఓ రైతన్న సొసైటీ అధికారి కాళ్ళు మొక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.దినికి సంబంధించిన విడియోను  పలువురు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తు ప్రభుత్వ తీరు పై మండి పడుతున్నారు.మండలంలో రైతులకు సరిపడా యూరియా లేకపోవడంతో రైతన్నలు యూరియా కోసం పడరాని పాట్లు పడతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి పంట సేద్యం చేసిన రైతన్నలు సమయానుకూలంగా పంటకు ఎరువుల అందించలేకపోతున్నామని వాపోతున్నారు. యూరియా బస్తాల కోసం రైతులు నాలుగైదు రోజుల నుండి ఉదయం 6 గంటలకే సొసైటీ కి చేరుకొని పడిగాపులు కాస్తున్నారు. దీంతో భారీ మొత్తంలో రైతన్నలు రావడంతో వారందరికీ సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో సొసైటీ అధికారులు పోలీసుల ప్రహార నడుమ యూరియాను పంపిణీ చేస్తున్నారు.
ఇదంతా ఓక యెత్తు అయితే అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒక మహబూబాబాద్ జిల్లాలోనే ఇంత కొరత ఎందుకని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా వచ్చిన కూడా దళారులకు అమ్ముకుంటున్నారని లేకపోతే మాకు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తన్నట్టు చూస్తూ ఉండడం గమనార్హంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Views: 22
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి
మహబూబాబాద్ జిల్లా:- ఓ రైతు అధికారి కాళు మొక్కి యూరియా అడుగుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పిఎసిఎస్ సొసైటీ వద్ద చోటుచేసుకుంది. యూరియా...
వినాయక చవితి ‘నవరాత్రి ఉత్సవాల’ కై పోలీసులకు సహకరించండి
ఘనంగా ‘ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం’
సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి
63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..
పాకెట్ మనీ కంట్రోల్ తో.. విద్యార్ధుల స్మోకింగ్ కు చెక్..
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో "స్పా" లపై దాడులు..