వినాయక చవితి ‘నవరాత్రి ఉత్సవాల’ కై పోలీసులకు సహకరించండి

On
వినాయక చవితి ‘నవరాత్రి ఉత్సవాల’ కై పోలీసులకు సహకరించండి

• వినాయక ప్రతిమను ప్రతిష్టించాలనుకుంటున్నారా? అయితే పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి.. • శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి.. • ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుంది • వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీలులేదు.. -జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 19, న్యూస్ ఇండియా : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఆయా మండల కేంద్రాలలో వివిధ మతాలకు చెందిన పెద్దలతో పీస్ కమిటీలు నిర్వహించాలని  జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ తెలియజేశారు. వినాయక ప్రతిమను ప్రతిష్టించదలచినవారు ముందస్తుగా ఫోటో లో పొందుపరిచినా లింక్ టైపుచేసి తద్వారా సంగారెడ్డి జిల్లా  పోలీసులకు ఆన్లైన్ లింక్ ద్వారా సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. యస్.హెచ్.ఒ.లు ప్రతి మండపాన్ని ప్రత్యక్షంగా సందర్శించాలని, అక్కడ మండపాల వద్ద భద్రతపరమైన ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. వినాయక ప్రతిష్టాపనకై ఏర్పాటు చేసే మండప నిర్మాణం రోడ్లపై చేపట్టకుండా, జనజీవనానికి ఇబ్బంది లేకుండా ఉండాలన్నారు. భద్రత దృష్ట్యా ప్రతి మండపం వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ పెద్ద శబ్దాలతో కూడిన లౌడ్ స్పీకర్స్, డి.జె.లకు అనుమతించకూడదన్నారు. ఎవరైన డి.జె. ఏర్పాటు చేస్తే మండప నిర్వాహకులపై, డి.జె యాజమానులపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు సూచించాలన్నారు. మండప ఏర్పాట్లకు సంభందించి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా పోలీసు అనుమతి తీసుకునేలా చూడాలని, మండపాల వద్ద మైకులు, స్పీకర్లను తక్కువ సౌండ్ తో, రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించేలా చూడాలని అన్నారు. నిమార్జనం రోజు చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండే విధంగా సంభందిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పాతనేరస్తులను, ముందస్తుగా బైండోవర్ చేయాలని, సమస్యలను సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడరాదు అన్నారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియా ద్వారా వచ్చే పుకార్లను నమ్మరాదని, ఫార్వార్డ్ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు.  కుల మతాలకు అతీతంగా, శాంతియుత వాతావరణంలో పండగను జరుపుకోవాలన్నారు.

 

గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారికి సంగారెడ్డి జిల్లా పోలీసుల సూచనలు: సంగారెడ్డి జిల్లాలో వినాయక మండపాలను ఏర్పాటు చేయదలచిన ప్రతి ఒక్కరు ఫోటో లో పొందుపరిచినా లింక్ టైపుచేసి తద్వారా పోలీసు వారికి ముందస్తు సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లింకులో సూచించిన వివరాలు పొందుపరిచిన అనంతరం, పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది, ఆ తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలి. వినాయక మండపం ఏర్పాటు చేయదలచిన ప్రదేశం వివరాలతో పాటు నిమజ్జనం చేసే ప్రదేశం, రోజు, సమయం మరియు దారి వంటి వివరాలను కుడా ఈ లింక్ ద్వారా నమోదు చేయవలిసి ఉంటుంది. బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే మండప యజమానులు రహదారులపై, ప్రజలు తిరిగే రోడ్లపై మరియు కాలిబాటలపైన ప్రతిష్టించరాదు. ఎట్టి పరిస్థితులలోను జనజీవనానికి అంతరాయం కలిగించరాదు. గణేష్ మండపాల వద్ద పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తుల వాహనాల పార్కింగ్ కొరకు తగినంత దూరంలో,  నిర్దేశించిన ప్రదేశాలలో పార్కింగ్ చేసుకొనె విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి. గణేష్ మండప నిర్వాహకులు విద్యుత్ సరఫరాకై విద్యుత్ శాఖ నుండి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి మరియు భారీ వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకొని, నాణ్యతతో కూడిన మండప నిర్మాణం చేపట్టాలన్నారు. మండపాల వద్ద మైకులు, స్పీకర్లను తక్కువ సౌండ్ తో, రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి.  ముఖ్యంగా భారీ శబ్దంతో ఉండే లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాట్లకు అనుమతి లేదు. ఎవరైనా లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పాఠశాలలు,  కళాశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల వద్ద, ప్రార్థనా మందిరాల వద్ద  పెద్ద శాబ్దాలతో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయరాదు. మరియు ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా  వాక్యలు చేయడం, పాటలు పెట్టడం వంటివి చేయరాదు. గణేష్ మండపాలను జాగ్రత్తగా చూసుకొనుటకు రాత్రి సమయంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు ఉండే విధంగా చూసుకోవాలి. గణేష్ మండపాల వద్ద టపాకాయలను, మందుగుండు సామాగ్రిని ఉంచరాదు, మండపాల వద్ద కరెంట్ పోయినా, ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ ల్యాంప్ అందుబాటులో ఉంచుకోవాలి. మండపాల వద్ద వీడియో రికార్డింగ్ కోసం సి.సి.టివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ మండపాల వద్ద లక్కీ లాటరీ లేదా బలవంతపు చందాలు చేయకూడదు. గణేష్ మంటపం దగ్గర మత్తు పదార్థములు సేవించడం, జూదం ఆడటం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గణేష్ మంటపం వద్ద ఇసుక బస్తాలను, నీటి డ్రమ్ములు వంటి అగ్ని నిరోధకాలను అందుబాటులో ఉంచుకోవాలి. రాత్రి సమయంలో తనిఖీ చేయడానికి వచ్చే పోలీస్ అధికారికి మంటప వలంటీర్లు సహకరించాలి. మట్టి వినాయక విగ్రహాలను పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మితిమీరిన విగ్రహ పరిమాణల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున విగ్రహ పరిమాణాలలో పరిమితులు పాంటించాలి. అత్యవసర సమయంలో, ఏదైనా సమాచారం ఉన్నా డయల్ 100 కు గాని, సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా జిల్లా ప్రజలందరికి జిల్లా పోలీస్ కార్యాలయం నుండి స్పష్టమైన సూచనలు చేసారు.Vinayaka chouthi precations copy

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి
మహబూబాబాద్ జిల్లా:- ఓ రైతు అధికారి కాళు మొక్కి యూరియా అడుగుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పిఎసిఎస్ సొసైటీ వద్ద చోటుచేసుకుంది. యూరియా...
వినాయక చవితి ‘నవరాత్రి ఉత్సవాల’ కై పోలీసులకు సహకరించండి
ఘనంగా ‘ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం’
సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి
63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..
పాకెట్ మనీ కంట్రోల్ తో.. విద్యార్ధుల స్మోకింగ్ కు చెక్..
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో "స్పా" లపై దాడులు..