చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో "స్పా" లపై దాడులు..
40 మంది అరెస్ట్... ఇద్దరు స్పా యజమానులు పరార్ లో ఉన్నారు..
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో స్పాలపై దాడులు..
40 మంది అరెస్ట్... ఇద్దరు స్పా

యజమానులు పరార్ లో ఉన్నారు..
ఎల్బీనగర్, ఆగస్టు 16, న్యూస్ ఇండియా ప్రతినిధి:చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా 8 స్పా సెంటర్లు అక్రమంగా నడుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో 16 ఆగస్టు 2025 పోలీసులు దాడులు నిర్వహించారు. చైతన్యపురి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1. మోజో వెల్నెస్ స్పా, అష్టలక్ష్మి ఆలయం సమీపంలో వాసవి కాలనీ కొత్తపేట యందు ముగ్గురుని అరెస్టు చేయడం జరిగింది. ఒకరు పురుషుడు కస్టమర్, స్పా సెంటర్ సిబ్బంది ఇద్దరు మహిళలు, స్పా యజమాని పరారీలో ఉన్నారు. 2. స్కై బ్యూటీ అండ్ స్పా విక్టోరియా మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తపేట్ స్పా యజమాని మహిళా, స్పా సిబ్బంది మహిళ ఇద్దరినీ అరెస్టు చేయడం జరిగింది. 3. ప్రశాంతమైన కుటుంబ సెలూన్ అండ్ స్పా, ప్రభాత్ నగర్, న్యూ నాగోల్ స్పా యజమాని పురుషుడు, ఐదుగురు స్పా మహిళ సిబ్బంది, ఒక కస్టమర్ పురుషుడు, ఏడుగురిని అరెస్టు చేయడం జరిగింది. 4. బ్రైట్నెస్ బ్యూటీ స్పా సాయి నగర్ కాలనీ శివాజీ విగ్రహం సమీపంలో స్పా మేనేజర్ పురుషుడు, సిబ్బంది ఇద్దరు స్త్రీలు, కస్టమర్లు ఇద్దరు పురుషులు ఆరుగురిని అరెస్టు చేయడం జరిగింది. స్పా యజమాని ఒకరు స్త్రీ అజ్ఞాతంలో ఉన్నారు. 5. లవి బ్యూటీస్ స్పా సాయి నగర్ కాలనీ, శివాజీ విగ్రహం దగ్గర యజమాని ఒకరు స్త్రీ, స్పా సిబ్బంది నలుగురు స్త్రీలు, కస్టమర్లు ముగ్గురు పురుషులు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేయడం జరిగింది. 6. శ్రీ ఎలైట్ స్పా అండ్ సెలూన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన అల్కాపురి పా మేనేజర్ ఒకరు పురుషుడు, పా సిబ్బంది ముగ్గురు స్త్రీల ను నలుగురిని అరెస్టు చేయడం జరిగింది. 7. విజెరిజోన్ స్పా నాగోల్ క్రాస్ రోడ్ స్పా మేనేజర్ పురుషుడు, కస్టమర్ పురుషుడు, స్పా సిబ్బంది ఎనిమిది మంది మహిళ థెరపిస్టులు, టెలికాలర్ మహిళ మొత్తం పదిమందిని అరెస్ట్ చేయడం జరిగింది. పైన తెలిపిన స్పాలపై దాడి నిర్వహించి, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comment List