ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- ఇంచార్జి దద్దాల
న్యూస్ ఇండియా కనిగిరి ఆగస్ట్06:
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట ఓటమి భయంతో బరితెగించి నల్లగొండువారిపల్లెలో బీసీ నేత,ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైయస్‌ఆర్‌సీపీ నేత వేల్పుల రాముతో పాటు పలువురు పార్టీ నాయకుల మీద టీడీపీ వారు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కనిగిరి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.జడ్పీటీసీ ఉప ఎన్నీకల్లో ఓడిపోతారనే భయంతో మా నాయకుల మీద దాడి చేస్తున్నారని,కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.ప్రజలకు ఏమి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారు కూటమి ప్రభుత్వంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడికి దిగడం దారుణమని,ఒక శాసనమండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేరా? అని ఆయన ప్రశ్నించారు. వాహనాలు ధ్వంసం చేసి,పెట్రోల్ పోసి నిప్పంటిస్తామంటూ అరాచకం సృష్టించారంటూ ఆయన మండిపడ్డారు.పులివెందుల లో శాంతి భద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Comment List