స్మార్ట్ మీటర్ల బిగింపు,విద్యుత్ చార్జీల పెంపుదల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వెంకటకృష్ణారెడ్డి
న్యూ స్ ఇండియా దరిశి ఆగస్టు 6:
స్మార్ట్ మీటర్ల బిగింపు విద్యుత్ చార్జీల పెంపుదల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల చైర్మన్ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమిని గెలిపిస్తే ఒక్క రూపాయి పెంపు ఉండదన్నారు.అవసరమైతే ఛార్జీల్లో 30 శాతం తగ్గిస్తామని గొప్పలు చెప్పారు.పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని స్మార్ట్ మీటర్ల బిగింపు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటిపై వెనక్కి తగ్గకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం తీవ్రమవుతుందని హెచ్చరించారు. అవి ట్రూ అప్ ఛార్జీలు కాదు సామాన్యుడిని నడ్డి విరిచే ఛార్జీలు రాష్ట్ర ప్రజానీకాన్ని పీల్చి పిప్పి చేసే ఛార్జీలు.జనం నెత్తిన మీరు పెడుతున్నది గుదిబండ ఇప్పటికే 17 వేల కోట్ల భారాన్ని మోపారు.ఇది చాలదన్నట్లు మరో 12 వేల కోట్ల మేర అధిక భారాన్ని మోపాలని చూడటం దుర్మార్గం.తీరా పవర్ దక్కాక 14 నెలల్లోనే రూ.30 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని జనం నెత్తిన పెడుతున్నారు.హామీలను మరిచి ఓటేసిన పాపానికి పేదోడి ఇళ్లను గుళ్ళ చేస్తున్నారు.ట్రూ అప్ పేరుతో ఎన్నాళ్లు ఈ దోపిడి.విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు చంద్రబాబు గారు చేసింది నమ్మక ద్రోహం.కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.12 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని ప్రజలపై పడకుండా చూడండి గతంలో విధించిన 17 వేల కోట్ల భారాన్ని సైతం వెనక్కి తీసుకోవాలి అని అన్నారు.
Comment List