కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

On
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 

ర్యాలీని ప్రారంభించిన  కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ 

భద్రాద్రిIMG20250809114328 కొత్తగూడెం ( న్యూస్ ఇండియా జిల్లా బ్యూరో నరేష్): భద్రాద్రి కొత్తగూడెంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచ  ఆదివాసీల దినోత్సవాన్ని  నిర్వహిస్తున్నారు . దానిలో భాగంగా శనివారం  జిల్లా పోలీసుల  ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ జెండా ఊపి ఆదివాసీల ర్యాలీని  ప్రారంభించారు. డీజే సౌండ్ లతో , ఆదివాసుల నృత్యాలతో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్  మీదుగా  కొత్తగూడెం క్లబ్ వరకు ర్యాలీ చేరుకుంది. ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాల వేశారు.  ఇటీవల మంచి ర్యాంకులు సాధించిన ఆదివాసీ విద్యార్థులను ఎస్పీ శాలువా మెమోటోతో  సన్మానించారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసీ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చర్ల మరియు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీల  విద్య,వైద్య, క్రీడ  అభివృద్ధి కోసం  భద్రాద్రి పోలీసులు చాలా కార్యక్రమలను నిర్వహించమని, మొట్టమొదటిసారిగా  జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం తెలిపారు. ఆదివాసులు కల మాసం లేని మనుషులని, చిన్న సహాయం గుర్తుంచుకుంటారన్నారు. ఏదైనా, ఎవరైనా  విద్యతోనే మార్పు వస్తుందన్నారు. ఉన్న భూమి కాపాడుకోవడం, చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం, పిల్లలకు కలగటం, దాని ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలను స్కూలు పంపించాలని, చదువుకున్న వారు కచ్చితంగా ఉద్యోగం చేయాలని. బాల్య వివాహాలు  నిర్మూలించాలని,  ఏ ఆరోగ్య సమస్య ఉన్న ఏఎన్ఎంకు సమాచారం ఇవ్వాలన్నారు. మంత్రాలు, చేతబడులు, నాటు మందులను నమ్మకుండా హాస్పటల్ వద్దకే వెళ్లాలని అన్నారు. 300 మంది నక్సల్స ఇటీవల కాలంలో లొంగి పోయారన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పోలీసుల ఆధ్వర్యంలో గ్రంధాలయాలు ఏర్పాటు చేశామన్నారు. పూసుగుప వద్దా మొబైల్ హాస్పిటల్ ను కోటి రూపాయల వ్యయంతో   పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. ఏ సమస్య ఉన్న పోలీసుల దృష్టికి తీసుకరావాలని అన్నారు. అనంతరం కొత్తగూడెం  డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్పిటలని, మెడికల్ క్యాంపులను  ఆదివాసీలు ఉపయోగించుకోలని అన్నారు. ప్రభుత్వ గిరిజన హాస్టల్సు బాలులకు, బాలికలకు సపరేట్గా ఉన్నాయని, పిల్లలను  చదివించుకోవాలని, ఆదివాసీలు క్రీడ రంగంలో దృఢంగా ఉంటారని, ప్రపంచ స్థాయిలో నిలబడే సత్తా ఉందని అన్నారు. ప్రపంచ మనుగడ  ఎటు పోతుంది అనే విషయాన్ని గమనించాలని, ఆధునిక వ్యవసాయంపై దృష్టికి సారించి, ఆర్థికంగా  అభివృద్ధి చెందాలని  ఉన్నారు. అనంతరం ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ...ఐక్య సమితి ఆగస్టు 9 ఆదివాసుల రోజు గా ప్రకటించిందని  ఒక పండుగ రోజుగా ఈ రోజునుఅభివర్ణించారు. క్రీడారంగంలో ఆదివాసులు రాణిస్తున్నారు. వారిని వెలుగులోనికి తీసుకొని రావాలి కోరారు.  ఫోక్సో చట్టాలపై ఆదివాసులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. బాల్యం దశ నుంచి యవ్వనం వరకు చదువు మాత్రమే కాపాడుతుందని అన్నారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో పల్లెలలోని ప్రజలకు చేరటం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో  సిఐలు కరుణాకర్, శివ ప్రసాద్, వెంకటేశ్వర్లు, ప్రతాప్,  ఎస్సైలు, రమణారెడ్డి, విజయ కుమారి, రవి, శిరీష, రమాదేవి, బాదావత్ రవి, రాకేష్, శివ, రాజశేఖర్, ట్రాఫిక్  ఎస్ఐ గడ్డం ప్రవీణ్  సింహారెడ్డి, చంద్రశేఖర్ పాల్గొనగా ...ఆదివాసీ నుంచి  నాయకులు సింగరేణిలో  సీఎం పిఎఫ్  రీజినల్ డైరెక్టర్  కనకమ్మ, తుడుం దెబ్బ  జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరావు , శ్రీనివాస్, వాసం  రామకృష్ణ, బట్టు కనకరాజు, కోరం కృష్ణయ్య,  నాగేశ్వరరావు రాష్ట్ర, పూనం శ్రీనివాస్, చీమల సత్యనారాయణ, బిచ్చ శ్రీనివాస్, నరసింహారావు, బాడిస మోహన్ రావు, పోడియం బాబురావు  తదితర  నాయకులు, ఆదివాసులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. అనంతరం ఆదివాసీలకు సహబంతి భోజనాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు.

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రభుత్వ భవనాలపై’ సోలార్ ప్లాంట్లు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రభుత్వ భవనాలపై’ సోలార్ ప్లాంట్లు
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 09, న్యూస్ ఇండియా : రాష్ట్రంలోని గ్రామపంచాయతీ భవనం నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ పవర్...
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
విద్య, వైద్య విషయంలో ఎల్లపుడు జిల్లా నాయకత్వం అందుబాటులో ఉంటుంది*
ఘనంగా 'సామూహిక వరలక్ష్మీ వ్రతాలు'
అప్రమత్తంగా ఉండండి... సమన్వయంతో వ్యవహరించండి