మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న అధ్యాపకులు..

On
మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..

మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న అధ్యాపకులు..

IMG_20250814_094725
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న అధ్యాపకులు..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, ఆగస్టు 14 న్యూస్ ఇండియా ప్రతినిధి:- డ్రగ్స్ కు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంగి రమేష్ అన్నారు. 'నషాముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్ఎస్ఎస్ పి.ఓ & ఎడిసి ఇన్చార్జి డాక్టర్ జాహెదా బేగం ఆధ్వర్యంలో మహేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక సామూహిక ప్రతిజ్ఞను చేయించారు. ప్రజలలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సంగి రమేష్ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని గమనిస్తే 1908 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఇంతియాసుద్దిన్ ఫారూఖి, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీదేవి, డాక్టర్ ఉపేంద్ర, డాక్టర్ గోపాల్, చిన్నోజి, రవళిక, కుమార్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ  జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ 
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియాబ్యూరోనరేష్):రాబోయే రెండు రోజుల్లో జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా...
‘భారీ భూ-కుంభకోణాన్ని' గాలికొదిలేసిన జిల్లా కలెక్టర్!
మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..
భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,
కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం
ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!
ప్రజలందరు అప్రమత్తం వుండాలి...