దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసిన పెద్దమ్మతల్లి పాలకమండలి 

On
దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసిన పెద్దమ్మతల్లి పాలకమండలి 

కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో నరేష్): పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయ పాలకమండలి సభ్యులు, ఈఓ తో కలిసి దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందించారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, సిబ్బంది వేతనాల పెంపుతో పాటుగా అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలతో కూడిన వినతి పత్రం అందించిన పెద్దమ్మతల్లి గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరావు పలు అంశాలపై దేవాదాయ డైరెక్టర్ తో చర్చించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ ను పాలకమండలి సభ్యులు, ఈఓ శాలువాతో సత్కరించి ఆలయ జ్ఞాపికను అందించారు. పాలకమండలి చైర్మన్ వెంట ఆలయ ఈఓ రజని, పాలకమండలి డైరెక్టర్లు చీకటి కార్తీక్, పెండ్లి రామిరెడ్డి, చెవ్ గాని పాపారావు, మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రేమ్  పాల్గొన్నారు.

Views: 22
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News