బాల కార్మిక వ్యతిరేకంగా (నిషేధంపై)అవగాహన కార్యక్రమం..
మల్కాజిగిరి డివిజన్ ముస్కాన్ టీం సబ్ ఇనస్పెక్టర్ రామకృష్ణ
ముందుకు ఒక అడుగు – బాల కార్మిక వ్యతిరేకంగా గొంతు కలిపే ప్రతి పౌరుడూ మార్పు దిశగా ఒక శక్తివంతమైన చిహ్నం అవుతారు..

బాల కార్మిక వ్యతిరేకంగా (నిషేధంపై)అవగాహన కార్యక్రమం..
ముందుకు ఒక అడుగు – బాల కార్మిక వ్యతిరేకంగా గొంతు కలిపే ప్రతి పౌరుడూ మార్పు దిశగా ఒక శక్తివంతమైన చిహ్నం అవుతారు..
మల్కాజిగిరి డివిజన్ ముస్కాన్ టీం సబ్ ఇనస్పెక్టర్ రామకృష్ణ
ఆపరేషన్ ముస్కాన్-XI లో భాగంగా రాచకొండ పోలీస్ కమీషనర్ జి. సుధీర్ బాబు, ఆదేశానుసారం, రాచకొండ మానవ అక్రమ నిరోధకవిభాగం (AHTU), ఇబ్రహీంపట్నం డివిజన్ ముస్కాన్ ( SMILE) టీం అధ్వర్యంలో మంగళపల్లి పరిధిలో గల కన్స్ట్రక్షన్ ఏరియాలో మేస్త్రీలకు, కూలీలకు అవగాహనా సదస్సును నిర్వహించడం జరిగింది. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం, వారి విద్యా అభివృద్ధికి తోడ్పడుదాం అనే నినాదం తో జరిగిన ఈ సదస్సులో మల్కాజిగిరి డివిజన్ ముస్కాన్ టీం సబ్ ఇనస్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. చైల్డ్ లేబర్ అంటే పిల్లలు చట్టబద్ధమైన వయస్సు కంటే తక్కువ వయస్సులో పని చేయడం, చట్టబద్ధమైన వయస్సు కంటే తక్కువ వయస్సులో పిల్లలు చేసే ఏదైనా పని చైల్డ్ లేబర్ అవుతుంది. సాధారణంగా, 14 లేదా 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు పనిలో ఉంటే, అది చైల్డ్ లేబర్ అవుతుంది. చట్టవిరుద్ధంగా పిల్లలను పనిలో పెట్టుకోవడం వారిచే పనులు చేయించడం వలన మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతారు. ఇది వారి ఆరోగ్యం, విద్య మరియు వారి శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వారి భద్రత మరియు అభివృద్ధికి హాని అవుతుంది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే బాలకార్మిక వ్యవస్థను సమూలముగా కూకటివేళ్ళతో పెకలించి బాలల హక్కులను కాపాడటం, వారి భవిష్యత్తును నిర్మించడం, వారి అభివృద్ధికి పూలబాట వేయగలం. బాలకార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టం 1986 ప్రకారం, 14 ఏళ్లలోపు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రమాదకర వృత్తులలో నియమించడం ఖచ్చితంగా నిషేధించబడింది. బాలల భవిష్యత్తును కాపాడటమే సమాజ బాధ్యత. ఈ దిశగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం మొత్తం కలిసికట్టుగా ముందడుగు వేయాలి. 14 ఏళ్ల లోపు పిల్లలెవ్వరూ కూడా శారీరక శ్రమకు గురయ్యే పనుల్లో పాల్గొనరాదు. పిల్లలు పాఠశాలలో చదివే వయస్సులో శ్రమించడం వల్ల వారి ఆరోగ్యం, అభివృద్ధి, విద్యా అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇది వారికి మానసికంగా, శారీరకంగా నష్టాన్ని కలిగించగలదు. దేశ భవిష్యత్తు అయిన బాలలను కార్మికులుగా మార్చడం అనేది నేరమే కాకుండా అనాగరిక చర్య.ఈ సందర్భంగా పిల్లలను పాఠశాలలకు పంపాలని, వారి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ ఎన్జిఓ సిబ్బంది, అవగాహనా సదస్సుకు సుమారు 50 మంది హాజరయ్యారు.
Comment List